కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేందుకు ఏపీ సీఎం జగన్ జీవోలు ఇస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం అమరావతిలో సెక్రటేరియట్ కట్టిందని.. అందులో కూర్చుని జగన్ ఇదేం రాజధాని అంటున్నారని విమర్శించారు.‘‘ఐటీ అభివృద్ధికి కట్టిన మిలేనియం టవర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను తరిమేస్తున్నారు. రుషికొండను ధ్వంసం చేశారు.. కైలసగిరిని నాశనం చేశారు. జగన్ పాలన ఎక్స్‌పైరీ డేట్ 3 నెలలు మాత్రమే. మూడు నెలల ముచ్చట కోసం వేల కోట్లు తగలేస్తున్నారు.’’ అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
👉 – Please join our whatsapp channel here –