DailyDose

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 షెడ్యూల్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 షెడ్యూల్‌

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష(JEE Advanced Exam) షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షను మే 26న (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో https://jeeadv.ac.in/index.html రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు మే 6వరకు అవకాశం కల్పించారు. మే 17 నుంచి మే 26 వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

JEE Advanced 2024 పరీక్ష మే 26న జరగనుంది. పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; పేపర్‌- 2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటుంది. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ జూన్‌ 2న విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై జూన్‌ 2 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది కీ, ఫలితాలను జూన్‌ 9న విడుదల చేస్తారు. అలాగే, ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(AAT)కు జూన్‌ 9 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జోసా ద్వారా ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జూన్‌ 10 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(AAT)ను జూన్‌ 12న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు. AAT ఫలితాలను జూన్‌ 15న ప్రకటిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z