చరిత్ర కాల గర్భంలో మరో నెల కలిసిపోతున్నది. మరో ఐదు రోజుల్లో నవంబర్ నెల ముగిసి డిసెంబర్ నెల ప్రారంభం కానున్నది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్నారు. ప్రతి పేమెంట్ డిజిటల్ అయినా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకు శాఖలను సంప్రదించవల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి క్షణం చాలా విలువైనది కావడంతో బ్యాంకు శాఖలకు వెళ్లే ముందు ఆయా రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయా? లేదా? అన్న సంగతి తెలుసుకుంటే వెసులుబాటుగా ఉంటుంది. దీని ప్రకారం డిసెంబర్ నెలలో వారాంతపు సెలవులు, పండుగ సెలవులు, రాష్ట్రాల వారీ సెలవులతో కలిపి 18 రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఇదీ డిసెంబర్ నెలలో బ్యాంకుల సెలవుల జాబితా
డిసెంబర్ 1 (శుక్రవారం) – అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఆవిర్భావ దినోత్సవం / స్థానిక విశ్వాస దినోత్సవం.
డిసెంబర్ 3 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 3 (సోమవారం) – సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ ఫీస్ట్ డే – గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 9 (రెండో శనివారం) – దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 10 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 12 (మంగళవారం) – పా-తోగాన్ నెంగ్మింజా సంగ్మా – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 13 (బుధవారం) – లోసూంగ్/ నామ్ సూంగ్ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 14 (గురువారం) – లోసూంగ్/ నామ్ సూంగ్ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 17 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 18 (సోమవారం) – యూ సోసోథామ్ వర్ధంతి – మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 19 (మంగళవారం) – గోవా విముక్తి దినోత్సవం – గోవాలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 23 (నాలుగో శనివారం) – దేశవ్యాప్తంగా సెలవు.
డిసెంబర్ 24 (ఆదివారం) – దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 25 (సోమవారం) – క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్త సెలవు.
డిసెంబర్ 26 (మంగళవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవు.
డిసెంబర్ 27 (బుధవారం) – క్రిస్మస్ సంబురాల సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 30 (శనివారం) – యూ కియాంగ్ నాంగ్ బాహ్- మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
డిసెంబర్ 31 (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
👉 – Please join our whatsapp channel here –