రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైన నేపథ్యంలో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లపై రూ.10.34 కోట్ల జరిమాన విధించింది.
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ స్కీం కింద నిబంధనలు పాటించకపోవడంతో సిటీ గ్రూపుపై అత్యధికంగా రూ.5 కోట్ల జరిమాన విధించింది. సిటీ బ్యాంకు గ్రూప్ ఔట్ సోర్సింగ్ ఫైనాన్సియల్ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక `సెంట్రల్ రిపోసిటరీ ఆఫ్ లార్జ్ కామన్ ఎక్స్ పోజర్స్ అండ్ అదర్స్`నిబంధన పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ.4.34 కోట్ల పెనాల్టీ విధించినట్లు మరో ప్రకటనలో వెల్లడించింది.రుణాలు, అడ్వాన్సుల మంజూరు విషయంలో నిబంధనలు, మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించినందుకు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌పై రూ.కోటి ఫైన్ విధించింది ఆర్బీఐ. మూడు బ్యాంకులు కూడా రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకే జరిమాన విధించినట్లు స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –