ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. జగన్ బెయిల్‌ను సీబీఐ, ఈడీ కనీసం సవాలు చేయలేదని రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి దిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
👉 – Please join our whatsapp channel here –