ఇండియా నుండి ఆర్ఆర్ఆర్ (RRR) ఆస్కార్ (Oscar) సాధించిన తరువాత ఇప్పుడు చాలా సినిమాలు ఆస్కార్ అవార్డు కోసం తమ సినిమాలను పంపించాలని ఆరాట పడుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ సినిమా అయినా? ఏ భాష సినిమా అయినా ఆస్కార్ గెలిచే సత్తా ఉంటుంది. అందుకే చాలా మంది మేకర్స్ ఆ దారిలో అడుగులు వేస్తున్నారు.
లేటెస్ట్గా ఆస్కార్ అవార్డు కోసం బాలీవుడ్ నుంచి 12’th FAIL మూవీ పోటీ పడుతోంది. ఇండిపెండెంట్ నామినేషన్ కింద 12th ఫెయిల్ సినిమాను ఆస్కార్స్‌కు పంపించినట్లు హీరో విక్రాంత్ మాసే వెల్లడించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్..ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.కాపీ కొట్టి పరీక్షలు రాసే చంబల్ విద్యార్థి కథను ఆస్కార్ వరకు తీసుకెళ్లడంలో డైరెక్టర్ వినోద్ చోప్రా కీ రోల్ పోషించాడు. కాపీ కొట్టే స్టూడెంట్..పట్టుదలతో చదవి చివరకు కాపీ కొట్టకుండానే పాసై..జీవితంలో ఎలా ఐపీఎస్ అయ్యాడన్న స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు.
👉 – Please join our whatsapp channel here –