వచ్చే ఏడాది జరుగబోయే ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) కోసం భారత రెజ్లర్లు(Indian Wrestleres) సన్నద్ధమవుతున్నారు. భారత రెజ్జింగ్ సమాఖ్య(IAF) రద్దు కావడంతో ఈసారి మన రెజ్లర్లు తటస్థ దేశం నుంచి బరిలోకి దిగనున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? విశ్వ క్రీడల్లో పాల్గొనే రెజ్లర్ల ఎంపిక కోసం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం(IOA) రెండంచెల ప్రక్రియను అనుసరించనుంది.
అవును.. దేశం తరఫున ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్నవాళ్లు.. జూన్‌లో ఛాలెంజర్‌తో తలపడనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఐఓఏ అడ్‌హక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఇప్పటివరకూ భారత్ నుంచిఅంతిమ్ పంగల్(Antim Panghal, 53 కిలోలు) మాత్రమే ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకుంది.
ఆమె జూన్ 1వ తేదీన చాలెంజర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అమిత్‌కు 2018 ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేశ్ ఫోగట్(Vinesh Phoghat) చాలెంజర్‌గా ఎదురుపడే అవకాశం ఉంది. అంతిమ్‌తో తలపడేది ఎవరనేది మే 31వ తేదీన ఖరారు కానుంది. ప్యారిస్ బెర్తుపై కన్నేసిన భారత రెజ్లర్లు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 19-21 మధ్య కిర్గిస్థాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్, టర్కీలో మే 9-12 నుంచి జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ రెండు టోర్నీల్లో భారత రెజ్లర్లు 17 మంది కంటే ఎక్కువమంది ఒలింపిక్ బెర్తులు దక్కించుకునే చాన్స్ ఉంది.
👉 – Please join our whatsapp channel here –