* తిరుపతిలో జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు(ఆదివారం) తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ తిరుపతికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలుకునున్నారు.ఇదిలా ఉండగా.. రెండు రోజల పర్యటన కోసం ప్రధాని మోదీ తిరుపతి వెళ్తున్నారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ శనివారం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. బీజేపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
* తెలంగాణ ప్రజలకు మోదీ కీలక హామీ
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. పెట్రోల్, డిజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని ప్రధాని మోదీ కీలక హామీ ఇచ్చారు. పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తుక్కుగూడలో బీజేపీ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు రావు, ఫింఛన్ దారులకు సరైన సమయానికి పింఛన్ అందదని బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీని గెలిపిస్తే సమయానికి జీతాలు, పెన్షన్లు ఇస్తామని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. బీఆర్ఎస్ ను గెలిపించినట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఒకే నాణేనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ముఖాలు.. కాంగ్రెస్‌కు కేసీఆర్ ప్రాణమిత్రుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని మోడీ గుర్తు చేశారు. కేసీఆర్, కాంగ్రెస్‌లు అభివృద్ధి గురించి కాకుండా నన్ను తిట్టడానికే ప్రాధాన్యతనిస్తారు.. కాంగ్రెస్ వేల కోట్ల అవినీతి చిన్నపిల్లలకు సైతం తెలుసు మోడీ విమర్శలు వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదని.. ఆ రెండు పార్టీలు స్వార్థపూరితమైనవని ధ్వజమెత్తారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు రెండు పార్టీలు అన్యాయం చేశాయి, ఓబీసీలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని ఫైర్ అయ్యారు. బీసీలను కాంగ్రెస్ పార్టీలు దొంగలు అన్నదని.. కాంగ్రెస్ నేతల గర్వం, అహంకారాన్ని అణచాలని మోడీ పిలుపునిచ్చారు. ఇరిగేషన్ స్కీములను ఇరిగేషన్ స్కాములుగా మార్చారని.. తెలంగాణలో కాంగ్రెస్ అవినీతి పాలనను కేసీఆర్ కంటిన్యూ చేశారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పాడని.. కానీ బీజేపీ గెలిస్తే తెలంగాణకు తొలి బీసీ సీఎంను అందిస్తామన్నారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదని.. ఇది నా హామీ అని మోడీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనన్నారు.
* మోదీ కేసీఆర్చెప్పేవన్ని అబద్ధాలే
పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.‘బిడ్డ కోసమే కేసీఆర్ మోదీతో చేతులు కలిపిండు. ఇద్దరూ ధనవంతులకే కొమ్ముకాస్తున్నరు. పేదలను మరింత పేదలుగా చేస్తున్నరు. పేదల ఖాతాల్లో మోదీ రూ.15 లక్షలు వేస్తామన్నారు.. వేశారా? రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ చెప్పారు.. చేశారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారు.. ఇచ్చారా? ఆప్ సర్కారుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారు.ఆయన ఆప్‌తో మద్యం స్కామ్‌లో పాలుపంచుకున్నారు. కాంగ్రెస్ తెచ్చిన పరిశ్రమలను కేంద్ర సర్కారు అమ్ముకుంటోంది. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చింది. బీఆర్ఎస్ సర్కారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచింది’ అని అన్నారు.
* పవన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
పవన్‌లా మాది ప్యాకేజీ పార్టీ కాదంటూ వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదని, పేదల పక్షాల నిలిచే పార్టీ వైఎస్సార్‌సీపీ అని పేర్కొన్నారు. షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్‌కు, ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్సార్‌సీపీకి చాలా తేడా ఉంది. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.‘‘రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్‌కు అభివృద్ధి గురించి తెలుస్తుంది. బీసీలకు పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా?. అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
* ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలోని పలు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. వచ్చేవారం దక్షిణ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. శని, ఆదివారాల్లో మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా రాజధాని చెన్నైలోని పాఠశాలలు మూతపడ్డాయి. అలాగే, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని చోట్ల ఆదివారం వర్షం, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. హిమాచల్‌లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తుందని అంచనా చేసింది. దీని కారణంగా మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతుందని, త్వరలో జమ్మూకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కశ్మీర్‌లో ప్రస్తుతం పొగమంచు పెరగ్గా.. రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ వివరించింది.
* తెలంగాణ ఎన్నికల ప్రశ్నాపత్రం’ లీక్
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ ముంచుకు వస్తోంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. సోషల్ మీడియా వేదికగా కారు పార్టీని, కేసీఆర్‌ను టార్గెట్ చేసేలా వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ఎన్నికల ప్రశ్నపత్రం: బుక్ లెట్ నెంబర్ కేసీఆర్ 420’ పేరుతో ఓ పేపర్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు, గ్రూప్-1 పరీక్ష పేపర్ లీక్, దళితులకు మూడెకరాల భూములు, ధరణి పోర్టల్, ఉద్యోగాల నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఆదర్శవంతమైన మహిళా లీడర్ ఎవరూ అంటూ ప్రశ్నకు లిక్కర్ కవిత, ఏడవ తరగతి పాసైన విద్యాశాఖ మంత్రి అంటూ ఆప్షన్స్‌లో పేర్కొన్నారు. ఈ పేపర్ ఇప్పుడు లీక్ అయిందంటూ కాంగ్రెస్ సెటైర్ వేసింది.
* రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, బీజేపీ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్నా సీఎం కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ అర్వింద్ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నార్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ.. రేవంత్ కంటే కేసీఆర్ మేలు. సీఎం కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు.2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?. కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్టే అని సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడు. చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
* బర్రెలక్క మనకు రోల్‌మోడల్
కొల్లాపూర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ బర్రెలక్క తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేశారు. ‘పార్టీలస్వామ్యం కాదు.. ప్రజాస్వామ్యం కావాలి. ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపించడానికి బర్రెలక్క లాంటి వారిని ఎన్నుకోవాలి. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలియగానే మొదట సంతోషించింది నేనే. ఆమె మనందరికీ రోల్ మోడల్ అవ్వాలి. బర్రెలక్కను చూసి మిగతా యువత కూడా రాజకీయాల్లోకి రావాలి’ అని జేడీ పిలుపునిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –