Agriculture

అనంతపురం రైతుకు ప్రపంచస్థాయి గుర్తింపు

అనంతపురం రైతుకు ప్రపంచస్థాయి గుర్తింపు

ఐక్యరాజ్యసమితి, కర్మవీర్‌ గ్లోబల్‌ ఫెలోషిప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య స్థాపించిన కర్మవీర్‌ చక్ర అవార్డు 2023-24 నారాయణప్పను వరించింది. ప్రకృతి వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతులకు స్వర్ణం, రజతం, కాంస్యం విభాగాల్లో ఈ అవార్డును అందజేస్తారు. కాంస్య విభాగంలో నారాయణప్ప అవార్డుకు ఎంపికయ్యారు. కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన నారాయణప్పకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమలో ప్రకృతి వ్యవసాయం చేపట్టి సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా నిరంతరం ఆదాయం పొందవచ్చని ఏటీఎం (ఎనీ టైం మనీ) మోడల్‌ రూపొందించి ‘రియల్‌ హీరోస్‌’ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. చిన్న కమతాల్లోనూ లాభాలు పొందవచ్చని నిరూపించారు. సమాజానికి సురక్షిత ఆహారం అందించడంతోపాటు నేలను కాపాడటంపై ఆయన కృషిని గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు. ఆయన రూపొందించిన ఏటీఎం నమూనాను రాష్ట్రంలో 3,500 మంది రైతులు అనుసరిస్తున్నారు. సోమవారం దిల్లీలో జరిగే కార్యక్రమంలో నారాయణప్పకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z