DailyDose

దేశంలో పెద్ద టైగర్ రిజర్వుకు కేంద్రం అనుమతి

దేశంలో పెద్ద టైగర్ రిజర్వుకు కేంద్రం అనుమతి

వన్యప్రాణి సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో 2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్‌ రిజర్వు ఏర్పాటు కానుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం (Nauradehi Wildlife Sanctuary), రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను (Rani Durgavati Wildlife Sanctuary) కలిపేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలు సాగర్‌, దమోహ్‌, నర్సింగ్‌పుర్‌, రైసెన్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ వల్ల దేశంలో పెద్ద పులుల సంఖ్య పెరగడంతోపాటు, స్థానికంగా పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఈ టైగర్‌ రిజర్వు కారణంగా దమోహ్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పర్యాటకం పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. దమోహ్‌కు ఇదో గొప్ప బహుమతి. రాబోయే మూడు నెలల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని దమోహ్‌ డివిజన్‌ అటవీ శాఖ అధికారి ఎంఎస్‌ ఉకెయ్‌ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z