Politics

రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీ

రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీ

రేణిగుంట ఎయిర్‌పోర్టుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఘన స్వాగతం పలికారు. తిరుపతిలో మోదీ రెండు రోజులు పర్యటించనున్నారు. కాసేపట్లో మోదీ తిరుమలకు వెళ్లనున్నారు.తిరుమలలోని శ్రీ రచనా అతిథి గృహానికి మోదీ చేరుకోనున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z