తెలంగాణలో ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఉపసంహరించుకోవడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే భారాస నేతలకు ఉందని విమర్శించారు.
‘‘మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దు చేసింది. ఆ వ్యాఖ్యలే కారణమని ఈసీ చెప్పింది. హరీశ్‌రావు నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్, హరీశ్‌కు లేదు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. 10 రోజుల్లో కాంగ్రెస్ రాగానే ₹15 వేలు రైతు భరోసా ఇస్తాం’’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
👉 – Please join our whatsapp channel here –