దృష్టి లోపం, కాలు లేదా చేయి తొలగింపు, పక్షవాతం బారినపడటం వంటి సందర్భాల్లో నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మెదడు రీవైరింగ్ చేసుకుంటుందన్న భావన తప్పని శాస్త్రవేత్తలు తేల్చారు. మన బుర్రకు ఆ సామర్థ్యం లేదని తేల్చారు. గాయం లేదా ఏదైనా లోపం తలెత్తినప్పుడు మెదడు తనను తాను పునర్‌వ్యవస్థీకరించుకుంటుందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త విధులు నిర్వర్తించేందుకు నిర్దిష్ట భాగాల తీరుతెన్నులను మార్చుకుంటుందన్న అభిప్రాయం ఇప్పటివరకూ ఉంది. సైన్స్ పాఠ్యపుస్తకాల్లోనూ ఇలాగే రాశారు. ‘‘కంటి చూపులేని ఒక వ్యక్తికి అద్భుత సామర్థ్యాలు ఉన్నాయి, పక్షవాతం బారినపడ్డ వ్యక్తి అనూహ్యంగా కాళ్లు, చేతులు కదిలించగలుగుతున్నాడు.. వంటి కథనాల గురించి విన్నప్పుడు ఇది నిజమేనని భావిస్తుంటాం’’ అని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మోటార్ లెర్నింగ్ అండ్ బ్రెయిన్ రిపెయిర్ సంస్థ డైరెక్టర్ జాన్ క్రాకేర్ తెలిపారు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో సంబంధిత వ్యక్తి మెదడు.. అప్పటికే అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాలను వినియోగించుకునేలా శిక్షణ పొందుతుందని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –