కార్తీక పౌర్ణమి సందర్భంగా శంబలనగరిలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసింది. గాయత్రి మాతను దర్శించుకోవడం, విగ్రహాన్ని తాకడం ద్వారా రుషి తపస్విల చైతన్యాన్ని స్వీకరించేందుకు వేలాది మంది పోటెత్తారు. భోజన ప్రసాదాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలోని రాజీపేటలోని శంబలనగరి ప్రతి ఏడాదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తూ వస్తోంది. అజ్ఞాత ఏకాంత మౌన గాయిత్రీ తపస్వి, రుషి తండ్రి ధ్యానం నాన్న ఆధ్యాత్మిక బిడ్డలు ఇందులో భాగస్వామి అయ్యారు.
శంబలనగరిలో ఆకాశ దీపం ప్రత్యేకం. 40 అడుగుల ఎత్తులో ఆకాశ దీపం. 300 కిలోల ఆవు నెయ్యి, 300 మీటర్ల పొడవైన ఒత్తి, 9 కిలోల కర్పూరంతో ఆకాశ మాహాదీపం వెలుగు ప్రసరించింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జ్యోతి ప్రజ్వలన చేశారు. జ్యోతి ప్రజ్వలనకు ముందు ధ్యానం అమ్మ గారు, 45 మంది పెళ్ళి కాని యువతులు ప్రమిదలను తలపై పెట్టుకొని గాయత్రీ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
శంబలనగరిలోని 9 అడుగుల పంచలోహ గాయత్రి మాత సృష్టి ఆధారాల దైవ చైతన్యముల ప్రతిరూపం. రుషి తండ్రి, 8 లక్షల 23 వేల 543 గాయత్రి తపస్సుల తప్పశ్శక్తితో నిండిన గాయత్రి మాతను దర్శించి, తాకి చైతన్యం స్వీకరించడానికి వేలాది మంది తరలివచ్చారు. దర్శనానికి వచ్చిన అందరూ భోజన ప్రసాదం స్వీకరించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z