* సెల్ఫీల కోసం ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు
ఇటీవల చాలా మంది ఏ చిన్న పని చేసినా కానీ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే తాము తినే ఆహార పదార్థాలును ఫొటో తీసుకున్నాకే తినడం మొదలు పెడుతున్నారు. అలాగే సెల్ఫీల కోసం చాలా ప్రమాదరకర స్టంట్స్‌తో ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా కానీ చాలా మందిలో మార్పు రావడం లేదు. సెల్ఫీ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటో తీసుకుంటున్నారు. తాజాగా, ఓ ఇద్దరు అమ్మాయిలు అందరూ చూస్తుండగానే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.వివరాల్లోకి వెళితే.. గుంటూరులో ఇటీవల గాంధీ పార్కును ప్రారంభించారు. దీంతో అక్కడి జనాలు పార్కును చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి ఇద్దరు అమ్మాయిలు వెళ్లారు. అక్కడ ఓ లొకేషన్ సూపర్‌గా ఉండటంతో ఇద్దరూ అక్కడ సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ముందు నేను దిగుతానంటే నేను అని గొడవ పెట్టుకున్నారు. అది కాస్త పెరిగి వారు జుట్టు పట్టుకుని ఘోరంగా కొట్టుకునే వరకు దారి తీసింది. దీంతో అది చూసిన పబ్లిక్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారిని లెక్కచేయకుండా వారిద్దరూ దారుణంగా కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
* ముంబైలో ఇద్దరు నకిలీ ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్టు
ఐపీఎస్ ఆఫీసర్లమంటూ ఇద్దరు వ్యక్తులు ముంబై(Mumbai)లో ఓ బ్యాంకు ఉద్యోగిని మోసం చేశారు. అనుకూల స్థలంలో పోస్టింగ్ చేయిస్తామంటూ ఆ ఉద్యోగి స్నేహితుడి నుంచి కూడా 35 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నకిలీ ఐపీఎస్‌లను అరెస్టు చేశారు. గణేశ్ శివాజీ చవాన్, మనోజ్ కుపిందర్ పవార్ అనే ఇద్దర్ని ఆ నగరానికి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ స్నేహితుడి ద్వారా ఆ ఇద్దరు నకిలీ ఐపీఎస్‌లు పరిచయం అయినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.కేంద్ర ప్రభుత్వ శాఖాల్లో తమకు ఉన్నత ఆఫీసర్లతో లింకులు ఉన్నాయని ఆ నకిలీ ఐపీఎస్‌లు చెప్పినట్లు ఫిర్యాదులో తెలిపారు. నిందితులు తమ వద్ద కోటి డిమాండ్ చేసినట్లు ఆ ఇద్దరు నకిలీలపై ఫిర్యాదు నమోదు అయ్యింది. బ్యాంకు ఉద్యోగికి అనుకూల పోస్టింగ్ చేసేందుకు ఇప్పటికు 35 లక్షలు వసూల్ చేశారు. నాలుగేండ్లుగా దీనిపై బ్యాంకు లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది.కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చినట్లు ఒక నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌ను కూడా ఆ ఐపీఎస్‌లు అందజేశారని ఫిర్యాదులో వెల్లడించారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరినప్పుడు, ఆ నకిలీలు బెదిరించడం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లమంటూ మోసాలకు పాల్పడుతున్న నకిలీ వ్యక్తులకు సంబంధించిన మరిన్ని ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
* భర్త చెవి కొరికేసిన భార్య
ఇటీవల చాలా మంది వేరు కాపురం పెట్టాలని కోరుకుంటున్నారు. అలా చేయడం వల్ల తమకు ఇష్టమున్నట్టు ఉండవచ్చని భావిస్తున్నారు. దానికి భాగస్వామి ఒప్పుకోకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. దీంతో చిన్న చిన్న వాటికే భాగస్వామితో గొడవలు పడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఓ వ్యక్తి తన భార్య చెవి కొరికిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తాను చెత్త పడేయడానికి బయటకు వెళుతు.. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రం చేయాలని చెప్పి వెళ్లానని.. తిరిగి వచ్చేసరికి ఇల్లంతా యధావిదిగా ఉందని దీంతో భార్యను ప్రశ్నించానని..దీంతో ఆమె తనతో గొడవకు దిగిందని తెలిపాడు. అంతేకాదు తాము నివసించే ఇంటిని సగం వాటా అమ్మేసి పిల్లలతో కలిసి వేరు కాపురం పెడతానని సతాయిస్తోందని వాపోయాడు. ఇల్లు అమ్మేందుకు తాను అంగీకరించకపోవడంతో గొడవ పెద్దది చేసి.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడిందని దాంతో తనకు కోపం ఎక్కువై ఆమెను పక్కకు నెట్టి బయటకు వెళ్లిపోతుండగా ఆమె తనను వెనక్కి లాగి తన కుడిచెవి కొరికేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ విషయం తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి
దేశంలో సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు (Vande Bharat Train )పై దాడులు కొనసాగుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లదాడికి (Stones Thrown) పాల్పడుతున్నారు. తాజాగా వందేభారత్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. రౌర్కెలా – పూరీ (Rourkela-Puri) మధ్య నడిచే వందే భారత్‌పై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దెంకనల్ – అంగుల్ రైల్వే సెక్షన్‌లోని మెరమండలి – బుధపాంక్ స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (East Coast Railway) అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కిటికీ ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ ఘటనతో 13 నిమిషాలు ఆలస్యంగా రైలు పూరీ చేరుకున్నట్లు తెలిపారు. ‘ట్రైన్ నంబర్ 20835 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై కొందరు రాళ్ల దాడి చేశారు. భువనేశ్వర్ – సంబల్‌పూర్ రైలు మార్గంలోని దెంకనల్ – అంగుల్ రైల్వే సెక్షన్‌లో మెరమండలి -బుధపాంక్ మధ్య కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ కిటికీ ధ్వంసమైంది’ అని ఓ ప్రకటనలో వెల్లడించారు.మరోవైపు ఈ ఘటనను రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిని కొడవలితో నరికి చంపిన ఘటన
పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిని కొడవలితో నరికి చంపిన ఘటన శనివారం రాత్రి ముళబాగిలు తాలూకా మిణజేనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. హతుడిని సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న మంజునాథ్ (48)గా గుర్తించారు. మంజునాథ్ బంగారుపేట తాలూకా మాదముత్తన హళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో తరచుగా గొడవ పడుతుండేవాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. మంజునాథ్ రెండవ భార్య వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మంజునాథ్ తన మొదటి భార్యతో దూరంగా ఉండి రెండవ భార్య నేత్రతో కలిసి ఉంటున్నాడు. నేత్ర, ఆమె ప్రియుడు కలిసి తన భర్త మంజునాథ్‌ను హత్య చేశారని మొదటి భార్య సౌభాగ్యమ్మ ఆరోపిస్తోంది. అయితే రూ. 40 వేల కోసం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని బంధువులు చెబుతున్నారు. మృతుడి మామ నాగరాజ్ ఫిర్యాదుతో పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
* అక్రమరీతిలో అబార్షన్లు చేసిన ఓ డాక్టరు అరెస్టు
అక్రమరీతిలో అబార్షన్లు(Illegal Abortions) చేసిన ఓ డాక్టరును, ల్యాబ్ టెక్నీషియన్‌ను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. గత మూడేళ్ల నుంచి ఆ డాక్టరు సుమారు 900 మందికి అక్రమంగా అబార్షన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ చందన్ బల్లాల్‌తో పాటు టెక్నీషియన్ నిసార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైసూరు జిల్లాలో ఉన్న ఆస్పత్రిలో పేషెంట్ నుంచి 30వేలు తీసుకుని అబార్షన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వారమే ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హాస్పిటల్ మేనేజర్ మీనా, రిసెప్షనిస్టు రిజ్మా ఖాన్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. అబార్షన్ల రాకెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. మాండ్యాలో ఉన్న బెల్లం తయారీ యూనిట్‌లో ఆల్ట్రాసండ్ స్కాన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –