DailyDose

శ్రీశైలంలో రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలంలో రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలంలో కార్తీక మాసం రెండవ సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కావడంతో ద్వాదశ జోతిర్లింగమైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం 1 గంట నుండి ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్న వాహనదారులు పడ్డారు. ఐదు కిలోమీటర్ల మేర భారీగా నిలిచిన వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం టోల్ గెట్ నుండి సాక్షిగణపతి, ముఖద్వారం వరకు ట్రాఫిక్​ స్థంభించింది. పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకున్నారు.

మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పట్టింది. భక్తులు తెల్లవారుజాము ( నవంబర్​ 27) నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం, ఉత్తర శివమాడవీధిలో భక్తులు దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకున్నారు.

కార్తీక సోమవారం పైగా పౌర్ణమి తిథి కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు క్యూ లైన్లలో ఉచితంగా పాలు, అల్పాహారం ప్రసాదంగా అందజేశారు.కార్తీక సోమవారం .. పౌర్ణమి రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించారు. ప్రధానాలయానికి ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z