Business

లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో టాప్‌-3లో హైదరాబాద్‌- వాణిజ్య వార్తలు

లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో టాప్‌-3లో హైదరాబాద్‌- వాణిజ్య వార్తలు

* లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో టాప్‌-3లో హైదరాబాద్‌

ఇళ్లను కొనుగోలుచేసేవారి అభిరుచులు మారాయి. కేవలం నివాసానికి మాత్రమే ఇల్లు అని కాకుండా.. నివసించే ఇంట్లో సకల సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో ఆర్థిక స్థోమత ఉండే వ్యక్తులు లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య ఏడు ప్రధాన నగరాల్లో రూ.4 కోట్లకు విలువైన లగ్జరీ హోమ్స్‌ విక్రయాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 97 శాతం మేర పెరిగిందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీబీఆర్‌ఈ తన నివేదికలో పేర్కొంది.లగ్జరీ ఇళ్ల విక్రయాల్లో ఏడు ప్రధాన నగరాల్లో దిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబయి, హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. 37 శాతం వాటాతో దిల్లీ-ఎన్‌సీఆర్‌ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉండగా.. 35 శాతంతో ముంబయి రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ 18 శాతం విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. పుణెలో 4 శాతం లగ్జరీ గృహాలు అమ్ముడైనట్లు నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థ, వ్యక్తుల ఆదాయాలు, జీవన ప్రమాణాలు పెరగడం వంటివి మెట్రో నగరాల్లో లగ్జరీ గృహాల అమ్మకాలు పెరగడానికి కారణమని సీబీఆర్‌ఈ తన నివేదిక పేర్కొంది.పండగ సీజన్‌ కావడంతో అక్టోబర్‌- డిసెంబర్‌ నెలల్లో మరింత స్థాయిలో విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని సీబీఆర్‌ఈ పేర్కొంది. ఈసారి తొలిసారి లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగనుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ పెరగడంతో పాటు, డెవలపర్లు అందిస్తున్న ప్రోత్సాహాకాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని నివేదిక తెలిసింది. స్మార్ట్‌ స్విచ్‌, మొబైల్‌తో ఆపరేట్‌ చేయగలిగే సాంకేతికతతో కూడిన స్మార్ట్‌హోమ్‌ టెక్నాలజీ పట్ల మక్కువ పెరగడంతో లగ్జరీ గృహాలు పెరుగుతున్నాయని పేర్కొంది. లగ్జరీ ఇళ్ల కొనుగోలుదారుల్లో భారీగా ఆస్తిపాస్తులున్న వారు, ఎన్నారైలు ఉన్నారని నివేదిక తెలిపింది.

మారుతి సుజుకి ఆడి కార్ల  ధరల పెంపు

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజురోజుకు కార్లకు గిరాకీ పెరుగుతున్నది. ద్రవ్యోల్బణం నేపథ్యంలో కార్ల తయారీకి ఉపయోగించే కమొడిటి ఖర్చులు పెరుగుతుండటంతో మరోమారు వివిధ మోడల్ కార్ల ధరలు పెరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. మారుతి సుజుకి.. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. 2024 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించాయి. ఆడి కార్ల ధరలు రెండు శాతం పెరగనుండగా, మారుతి సుజుకి ఎంత మేరకు పెంచుతామో వెల్లడించలేదు.మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ ఆల్టో మొదలు మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్ ఇన్‌విక్టో వరకూ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. `ద్రవ్యోల్బణం ప్రభావంతో పెరిగిన ఖర్చులు, కమొడిటీ ధరలు పెరిగిపోయాయని. దీనివల్ల 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మా కార్ల ధరలు పెంచాలని ప్రణాళిక రూపొందించాం’ అని మారుతి సుజుకి సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ‘కార్ల తయారీ ఖర్చులు తగ్గించడానికి గరిష్టంగా చర్యలు చేపట్టాం. కానీ మార్కెట్లో ఖర్చులు పెరుగుతుండటంతో అన్ని మోడల్ కార్ల ధరలు కొంత మేర పెంచక తప్పడం లేదు’ అని పేర్కొంది.ఆపరేషనల్ కాస్ట్స్, ఇన్ పుట్ వ్యయం పెరిగిపోయిన నేపథ్యంలో అన్ని మోడల్ కార్లపై జనవరి ఒకటో తేదీ నుంచి రెండు శాతం ధరలు పెంచుతామని ఆడి ఇండియా తెలిపింది. ‘సప్లయ్ చైన్ ఖర్చులు పెరిగాయి. ఆపరేషనల్ కాస్ట్స్ ఎక్కువయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మేం మా కార్ల ధరలు పెంచక తప్పలేదు. ఆడి ఇండియా, మా డీలర్ల సుస్థిర గ్రోత్ సాధించేందుకు ధర పెంచాల్సి వస్తోంది. కస్టమర్లపై ధరల పెంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆడి ఇండియా ‘క్యూ3` ఎస్‌యూవీ నుంచి స్పోర్ట్స్ కారు ‘ఆర్ఎస్ క్యూ8’ వరకూ రూ.42.77 లక్షల నుంచి రూ.2.22 కోట్ల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది.

గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు రాజీనామా

కంపెనీలో పనిచేస్తున్న చిరుద్యోగి మొదలు నాయకత్వ స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిపై పనిఒత్తిడి ఉంటుంది. కానీ అది వారి స్థాయులను బట్టి మారుతోంది. కంపెనీ దానికి సంబంధించిన రంగంలో దూసుకుపోతుంటే ఇంకా మార్జిన్లు పెంచాలనే ధోరణి కనిపిస్తోంది.ఒకేవేళ మార్కెట్లో కంపెనీ స్థానాన్ని కోల్పోతే తిరిగి పునరుద్ధరించే దిశగా పనిచేయాలని ఒత్తిడి ఉంటుంది. ఏటా పెరుగుతున్న టార్గెట్‌లు, పనితీరులో అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం, ప్రతిభ కోసం పాకులాట వంటి వివిధ ఒత్తిళ్ల కారణంగా కంపెనీలోని అగ్రశ్రేణి నాయకత్వంలో పని చేస్తున్న వారి రాజీనామాలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లో ఏకంగా 110 మంది సీఈవోలు వారి పదవుల నుంచి వైదొలిగినట్లు సమాచారం.కొవిడ్ తర్వాత భారతదేశంలోని కంపెనీలు సీఈవో, ఎండీ స్థాయి ఉద్యోగులు రాజీనామా చేస్తున్న ధోరణి గణనీయంగా పెరిగింది. 2023 మొదటి 10 నెలల సమయంలో ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల బోర్డుల్లో పనిచేస్తున్న 110 మంది మేనేజింగ్ డైరెక్టర్లు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు తమ పదవుల నుంచి వైదొలిగారు. 2023లో నమోదైన పదవుల నిష్క్రమణలో అధికంగా రాజీనామాల వల్లే జరిగినట్లు డేటా వెల్లడిస్తోంది. అగ్రనాయకత్వంపై కంపెనీల్లో పెరిగిపోతున్న అంచనాలు, ఆ అంచనాలు అందుకోకపోతే వారి పనితీరుపై అసహనం, సంక్లిష్టమైన వ్యాపార వాతావరణం వంటి వివిధ ఒత్తిళ్లతో అగ్రశ్రేణి రాజీనామాలు హెచ్చవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.మహమ్మారి సమయంలో కంపెనీలు మారితే ఆ స్థాయిలోని వారిని ఇతర సంస్థలు వెంటనే తీసుకునే పరిస్థితి లేకుండాపోయింది. దాంతో అప్పుడు ఎక్కువ రాజీనామాలు జరగలేదు. కొవిడ్‌తో దాదాపు ఏడాదికిపైగా కంపెనీలు ఆర్థిక అనిశ్చుతులు ఎదుర్కొన్నాయి. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్జిన్లు, టార్గెట్లు పెంచి ఎండీ/ సీఈఓలపై ఒత్తిడి పెంచుతుండడంతో ఈ రాజీనామాలు అధికమవుతున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు అదే రంగంలోని ఇతర కంపెనీలు నైపుణ్యాలు ఉన్న అగ్రశ్రేణి నాయకత్వానికి మంచి ప్యాకేజీ ఆఫర్‌ చేస్తున్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సీఈవోల రాజీనామాలు పెరుగుతున్నాయి.

ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌

ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ క్రోనాక్స్‌ ల్యాబ్‌ సైన్సెస్‌ ఐపీఓ (Kronox Lab Sciences IPO)కు సిద్ధమవుతోంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూలో రూ.45 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయనున్నారు. మరో 78 లక్షల ఈక్విటీ షేర్లు ప్రమోటర్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. మార్కెట్‌ అంచనాల ప్రకారం.. ఈ ఐపీఓ పరిమాణం రూ.150 కోట్ల వరకు ఉండొచ్చు. ప్రాథమిక పత్రాల్లోని వివరాల ప్రకారం.. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను క్రోనాక్స్‌ ల్యాబ్‌ తమ నిర్వహణ మూలధన వ్యయాలతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. వడోదరా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ అత్యంత స్వచ్ఛతతో కూడిన ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుంటుంది. ఫార్మా ఫార్ములేషన్లు, యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్లు, బయోటెక్‌, శాస్త్ర పరిశోధన, న్యూట్రాస్యూటికల్స్‌, వ్యక్తిగత సంరక్షణ, అగ్రోకెమికల్స్‌, పశువుల ఆరోగ్య సంరక్షణ, మెటలర్జీ వంటి పరిశ్రమలకు కావాల్సిన ఉత్పత్తులను ఈ కంపెనీ అందిస్తోంది.ఇరవైకి పైగా దేశాలకు ఈ కంపెనీ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ జాబితాలో అమెరికా, యూకే, మెక్సికో, ఆస్ట్రేలియా, ఈజిప్టు వంటి దేశాలు ఉన్నాయి. Pantomath క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒక్కటే ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్ లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదు కానున్నాయి.

ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు

మీరు డీజిల్ ఇంజిన్‌తో కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఉండాలనుకుంటే, మీకు రూ. 15 లక్షల కంటే తక్కువ ధరకు కేవలం 3 ఎంపికలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ టాటా, మహీంద్రా, కియా సబ్‌కాంపాక్ట్ SUVలు.దాని డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్‌ల ధరల శ్రేణి రూ. 12.31 లక్షల నుంచి రూ. 14.76 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117PS, 300Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ డీజిల్ SUV ఆటోమేటిక్ వేరియంట్ 6-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.XUV300లో Android Auto, Apple CarPlay, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ముందు/వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.దీని డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్ ధరల శ్రేణి రూ. 13.05 లక్షల నుంచి రూ. 14.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఇది 116PS, 250Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. 6-స్పీడ్ iMT (క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఎంపిక కూడా ఉంది.ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎసి, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD, ESC, TPMSతో కూడిన ABS కూడా ఉన్నాయి. టాటా నెక్సాన్.. దాని డీజిల్-ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 14.30 లక్షల నుంచి రూ. 15.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 115 PS/260 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దాని ఆటోమేటిక్ వేరియంట్లలో, 6-స్పీడ్ AMT డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. Nexon డీజిల్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్, హైట్-సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z