ఆసియా గేమ్స్‌లో వెండి పతకంతో మెరిసిన యువ గోల్ఫర్ అదితి అశోక్(Aditi Ashok) మరోసారి సత్తా చాటింది. అండలూసియా కోస్టా డెల్ సొల్ ఓపెన్ డి ఎస్పనా టోర్నమెంట్ విజేతగా నిలిచింది. స్పెయిన్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదితి.. నెదర్లాండ్స్‌కు చెందిన అన్నె వాన్ డామ్(Anne Van Dam)పై గెలుపొందింది. 69, 68, 68, 66 పాయింట్లతో లేడిస్ యూరోపియన్ టూర్(LET)లో రెండో టైటిల్ కొల్లగొట్టింది. 25 ఏండ్ల అదితికి ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్ కాగా.. మొత్తంగా ఆమెకు ఇది ఐదో ఎల్ఈటీ టైటిల్.
‘ఈ ఏడాది ఆరంభంలో కెన్యాలో మొదటి టైటిల్ గెలిచిన అదితి ఏడాది చివర్లో ట్రోఫీ సాధించడం విశేషం. నేను మొదట్లో నిదానంగా ఆడాను. మొదటి ఆరు నుంచి ఎనిమిది సార్లు గురి తప్పాను. ఏడో ప్రయత్నంలో కొద్దిలో మిస్ అయింది. అప్పుడు నాకు చాన్స్ ఉందని అనిపించింది. అన్నేతో పోరు గొప్పగా సాగింది. ఆమె మంచిగా ఆడుతున్నప్పుడు ఐదు నుంచి 10 షాట్లను గురి చూసి కొట్టగలదు. కానీ, ఈరోజు నేను పైచేయి సాధించాను’ అని అదితి తెలిపింది.అంతర్జాతీయ వేదికలపై అదరగొడుతున్న అదితి ఆసియా గేమ్స్‌లో రికార్డు నెలకొల్పింది. చైనా ఆతిథ్యం ఇచ్చిన 19వ ఆసియా గేమ్స్‌లో అదితి వెండి పతకం సాధించింది. దాంతో, ఈ టోర్నీలో పతకం గెలిచిన భారత తొలి గోల్ఫర్‌గా అదితి చరిత్ర సృష్టించింది.
👉 – Please join our whatsapp channel here –