Sports

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో విజేతలకు ఇచ్చే మెడల్స్ పై జగన్‌ బొమ్మ

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో విజేతలకు ఇచ్చే మెడల్స్ పై జగన్‌ బొమ్మ

వైకాపా తన ప్రచారానికి దేనిని వదలడం లేదు. చివరికి ప్రభుత్వ నిధులతో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలకు సంబంధించిన పరికరాలను సైతం పార్టీ ప్రచారానికి వాడుకుంటోంది. ఆ క్రీడాపోటీల సామగ్రి ఇటీవల కర్నూలు నగరంలోని డీఎస్‌ఏ స్టేడియానికి చేరుకుంది. క్రికెట్‌ కిట్‌ బ్యాగు, వికెట్లపై ముఖ్యమంత్రి చిత్రాలు ముద్రించడం గమనార్హం. విజేతలకు అందించే పతకాలపైనా సీఎం జగన్‌ బొమ్మ ముద్రించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ఇలా పార్టీ ప్రచారానికి ఉపయోగిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z