Business

ఏపీలో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

ఏపీలో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

రిలయన్స్‌ జియో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఎయిర్‌ఫైబర్‌ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్మార్ట్‌ హోమ్‌ సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌-టు-ఎండ్‌ సొల్యూషన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర డిజిటల్‌ ల్యాండ్‌స్కేప్‌కు గణనీయమైన మెరుగుదల ఉంటుందని తెలిపారు. జియో.. ఎయిర్‌ఫైబర్‌ సేవల విస్తరణతో యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించడానికి నిబద్ధతతో పని చేస్తుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z