ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రజల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీలోని వారెన్ పట్టణ పోలీసు అధికారి డిటెక్టివ్ సార్జంట్ జోసెఫ్ కోహెన్ ఈ అవగాహన సదస్సులో దొంగతనాలు, దోపిడిల నివారణ, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటి భద్రతా పరికరాలు, సైబర్ సెక్యూరిటీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. స్వీయ/వ్యక్తిగత భద్రతపై విలువైన సూచనలు చేసినందుకు నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, అధ్యక్షుడు నూతి బాపులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు గంగాధర్ దేసు, రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, మురళీకృష్ణ మేడిచర్ల, బసవశేఖర్ శంషాబాద్, శ్రీనివాస్ భీమినేని, బిందు యలమంచిలి, ఫణి తోటకూర, సూర్యం గంటి తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z