గోల్డెన్ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య దీన్ని రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మీనం 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –