కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిం చాలి. అలాగే రావిచెట్టును ప్రతి నిత్యం పూజించేవారికి దారిద్య్రం తొలగిపోతుంది. మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజిం చాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరు తాయని నమ్మకం. సంతానయోగం కలుగు తుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితుల ఉవాచ.
ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వల్ల దోషం కలుగుతుంది. అందు వలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితా లుంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే రావిచెట్టు దేవతావృక్షంగా, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు చెబుతారు.
👉 – Please join our whatsapp channel here –