ప్రయాణికులకు మెట్రో రైలు అధికారులు కీలక సూచన చేశారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ప్రారంభమై.. నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –