Politics

కాంగ్రెస్‌ నేతలు భాజపాను ఎందుకు ప్రశ్నించడం లేదు?

కాంగ్రెస్‌ నేతలు భాజపాను ఎందుకు ప్రశ్నించడం లేదు?

కాంగ్రెస్‌ నేతలు భాజపాను ఎందుకు ప్రశ్నించడం లేదని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు ఈసీ వెంటపడి మరీ రైతుబంధు ఆపివేయించారని మండిపడ్డారు. ఆ పార్టీ మరోసారి రైతు వ్యతిరేకతను చాటుకుందని.. అన్నదాత నోటికాడి ముద్దను లాగేశారని ఆమె విమర్శించారు.

‘‘ఉపాధి హామీ నిధులకు కేంద్రం భారీగా కోతలు విధించింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు సగటున రూ.150 కూడా రావడం లేదు. వేలమంది కూలీల పొట్టగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్‌ ఎందుకు చేయడం లేదు?పెద్దపెద్ద కార్పొరేట్లకు మాత్రమే మోదీ సాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడా వ్యాపారులకే రుణాలు మాఫీ చేసింది. తెలంగాణలో భారాస ప్రభుత్వం వచ్చాక ఇచ్చినన్ని ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు. భారాస మళ్లీ గెలిస్తే కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం. కులమతాల పేరుతో కొన్ని పార్టీలు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయి. ఇరిగేషన్‌ కావాలా.. మైగ్రేషన్‌ కావాలా? రైతుబంధు కావాలా? రాబందులు కావాలా?24 గంటల విద్యుత్‌ కావాలా? 3 గంటల కరెంట్‌ కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలి’’ అని కవిత అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z