దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నేతకారులు ఈ చీరను తయారు చేశారు. దీన్ని దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణంలో విక్రయానికి ఉంచారు. ‘‘ఈ సారి నిర్వహిస్తున్న వాణిజ్య ప్రదర్శనలో నేను తెచ్చిన చీరలు బాగానే అమ్ముడయ్యాయి. ట్రేడ్ ఫెయిర్ ప్రారంభమైనప్పటి నుంచే భారీగా ఆర్డర్లు పెట్టాం. ప్రత్యేకంగా వాటిని తెప్పించి విక్రయిస్తున్నాం. బంగారు పూత చీరలను నాలుగు తెచ్చాను. అందులో మూడు అమ్మేశాను. చివరి దానిని రూ.2.25 లక్షలకు విక్రయించాను’’ అని చీర తయారు చేసిన మహ్మద్ తబీష్ పేర్కొన్నారు. ఈ చీరను 6 నెలలకోసారి సూర్యరశ్మీ తాకేలా పెట్టాలని.. అలా చేయకపోతే చీర లోపల క్రిమికీటకాలు ఏర్పడి పాడయ్యే అవకాశం ఉందని తబీష్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –