మేషం
కొద్దిగా జాప్యంగానైనా పెండింగు పనులు పూర్తి చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోకుండా తలెత్తిన సమ స్యలను తెలివిగా పరిష్కరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యో గుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
వృషభం
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్నేహితులతో కొద్దిగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మిథునం
ప్రముఖ వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావ కాశాలు లభిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కర్కాటకం ()
చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది.
సింహం
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్త ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. అన్నదమ్ములతో స్థిరాస్తి వ్యవహా రాలు పరిష్కారం అవుతాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలు గుతుంది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదా నంగా పూర్తవుతాయి. సామాజిక కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య
ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చివరి క్షణంలో ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు సాఫీగా సాగి పోతాయి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో రాబడినిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలలో సాను కూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం మారడానికి ప్రయ త్నాలు చేయవచ్చు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
తుల
తలపెట్టిన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. సతీ మణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ప్రత్యేక బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం పరవా లేదు.
వృశ్చికం
కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న ట్టుగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబసమేతంగా ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో అన్యో న్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
మకరం
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగు తాయి. ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆర్థికంగా నష్టపోయే సూచనలు న్నాయి.
కుంభం
తలపెట్టిన పనుల్లో ఆశించిన స్థాయిలో కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగవుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందుతారు. మొత్తం మీద రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం
వ్యయప్రయాసలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలై నంతగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో చిక్కులు తొలగి పోతాయి. నిరుద్యోగులకు శుభ వార్త అందుతుంది. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు.