Food

మరమరలతో రుచికరమైన వడ రిసిపి

మరమరలతో రుచికరమైన వడ రిసిపి

మరమరాల వడ.. తయారీకి కావలసిన పదార్ధాలు

మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి)

పెరుగు – 3 టేబుల్‌ స్పూన్లు

గోధుమ పిండి – పావు కప్పు

మైదా పిండి – పావు కప్పు

అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్‌ చొప్పున

తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్‌ + గార్నిష్‌కి

కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని

ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్,

పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్,

నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా

తయారీ విధానం

ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్‌ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్‌ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్‌కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z