తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia gandhi) తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘‘నేను మీ వద్దకు రాలేకపోతున్నా. మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుకుందాం. (Congress) తెలంగాణ ప్రజలకు మంచి ప్రభుత్వం లభించాలి. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి. సోనియమ్మ అంటూ నాపై ఎంతో ప్రేమ చూపారు. మీ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి. మార్పు కోసం కాంగ్రెస్కు ఓటు వేయండి’’ అని సోనియా గాంధీ సందేశం ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –