కార్తిక మాసం సందర్భంగా ఐర్లాండ్‌లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకకు వందలాది మంది భారతీయులు హాజరై మహాదేవుడి ఆశీర్వాద ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించిన శ్రీ శివశక్తి కార్యవర్గ సభ్యులకు భక్తులంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతీ సంప్రదాయాలు, మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామన్నారు.
👉 – Please join our whatsapp channel here –