నిజాయితీ గల కోరికైతే బలంగా అనుకుంటే నెరవేరుతుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉంది జాతీయ ఉత్తమనటి కృతి సనన్. జాతీయ వార్డుల వేడుకలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పింది.
జాతీయ ఉత్తమనటుడిగా అవార్డును అందుకోవడానికి బన్నీ ఆ కార్యక్రమానికి రావడం, బన్నీతో కలిసి ఫొటోలకు పోజులివ్వడం.. ఆ సందర్భంలో మీడియా ముందు తన కోరికను తెలియజేయడం జరిగింది. సందర్భం డిమాండ్‌ని బట్టి తను అలా మాట్లాడిందని చాలామంది అప్పట్లో అనుకున్నారు. కానీ కృతిసనన్‌కి ఆ కోరిక బలంగానే ఉన్నట్టుంది. తాజాగా మరోసారి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్లీ అదే కోరికను వ్యక్తం చేసింది కృతి.
‘అల్లు అర్జున్‌ను తొలిసారి నేషనల్ అవార్డుల ఫంక్షన్‌లో చూశాను. కాసేపు మాట్లాడినా చాలు.. ఎవరైనా అతని అభిమానులు అయిపోతారు. తను అద్భుతమైన నటుడేకాదు, అద్భుతమైన వ్యక్తి కూడా. బన్నీతో కలిసి పనిచేసే క్షణాలకోసం ఎదురు చూస్తున్నాను. మా ఇద్దరికీ తగ్గ కథను ఎవరైనా దర్శకుడు తయారు చేయాలని, అది తర్వగా జరగాలని కోరుకుంటున్నా’ అని అశాభావం వ్యక్తం చేసింది కృతి సనన్.
👉 – Please join our whatsapp channel here –