NRI-NRT

NRI BRS: కువైట్‌లో దీక్షా దివస్‌

NRI BRS: కువైట్‌లో దీక్షా దివస్‌

తెలంగాణ(Telangana) చరిత్రనే మలుపు తిప్పిన రోజు 2009 నవంబర్ 29 అని.. కేసీఆర్‌(CM KCR) చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలంగాణ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎన్నారై కువైట్(Kuwait) ఆధ్వర్యంలో దీక్షా దివస్‌(Deeksha Divas)ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు ప్రాణ త్యాగం చేశారు. వారందరినీ స్మరించుకుంటూ దీక్షా దివస్‌ చేపట్టామన్నారు. కేసీఆర్‌ స్ఫూర్తితో తాము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నామని గుర్తు చేసుకున్నారు.

తెలంగాణలో గత ఆరు దశాబ్దాలలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే కేవలం కేసీఆర్‌ వల్లనే సాధ్యం అవుతుందని అభిలాష తెలిపారు. కేసీఆర్‌ హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ కుమార్ మార్క, సురేష్ గౌడ్, అయ్యప్ప, సమియుద్దీన్, జమీల్, రవి సూర్య, తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z