టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్’ వినూత్నమైన ‘స్టెమ్ సెల్’ చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్టు ప్రముఖ జర్నల్ ‘నాచుర్ బయోటెక్నాలజీ’ నివేదిక పేర్కొన్నది. రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ.. రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవాల్సిన అవసరం లేదని, ఈ పని ‘వీసీ-02’ అనే చిన్న పరికరం శరీరం లోపల నిర్వర్తిస్తుందని నివేదిక తెలిపింది. దీని ప్రకారం, నిరంతరం ఇన్సులిన్ విడుదలపై స్వీయ నియంత్రణ చేపట్టేందుకు ఓ చిన్న పరికరాన్ని రోగి చర్మం లోపల ప్రవేశపెడతారు.
ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కర్మాగారంగా శరీరం లోపల పనిచేస్తుందని ‘యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా’ ప్రొఫెసర్ టిమోతీ కిఫర్ అన్నారు. కెనడాలోని వాంకోవర్ జనరల్ దవాఖాన, అమెరికా, బెల్జియంలలో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఆరు నెలల తర్వాత రోగులను పరిశీలించగా, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని, ప్రతిరోజూ బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం తప్పిందని నివేదిక తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –