NRI-NRT

అమెరికాలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్‌స్టేట్‌ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. పొక్టాటెల్లో విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో స్వల్పంగా గాయపడిన ఒక వ్యక్తిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తీసి పరిస్థితిని చక్కదిద్దడానికి ఏడు గంటల సమయం పట్టింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z