NRI-NRT

52 దేశాల్లో భారాస దీక్ష దివస్

52 దేశాల్లో భారాస దీక్ష దివస్

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించారు. అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్‌, న్యూయార్క్‌లలో, బ్రిటన్‌ రాజధాని లండన్‌లో, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీతో పాటు మలేసియా, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా, ఖతర్‌, కువైట్‌, టాంజానియా తదితర దేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించినట్లు భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం, పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలు జరిపినట్లు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z