భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. (Telangana Elections 2023) ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ (Congress) ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు.
అయితే ఆమె మీడియాతో మాట్లాడుతూ భారాసకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు నిరంజన్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –