వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ వరుసగా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలకు ముందకు వెళ్తుంది.. అందులో భాగంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోన్నారు.. అయితే, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంపై దాఖలైన వ్యాజ్యంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. హైకోర్టులో జర్నలిస్టు కట్టేపోగు వెంకయ్య పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన తరపున వాదనలు వినిపించారు న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్.. జగన్ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి యేమిటి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు న్యాయవాదులు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, ప్రభుత్వ సొమ్ము వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఉద్యోగులను ఇందులో పాల్గొనడంపై సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు ఇచ్చారంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు.. అయితే, పిల్ లో ప్రతివాదులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ, పంచాయితీరాజ్, పురపాలక శాఖ, గ్రామ, వార్డ్ సచివాలయం ఉన్నతాధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
👉 – Please join our whatsapp channel here –