సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన సినీ నటుడు మంచు మనోజ్ (Manoj Manchu) మళ్లీ ట్రాక్ ఎక్కారు. ఇప్పటికే ఆయన కథానాయకుడిగా ‘వాట్ ది ఫిష్’ చిత్రం తెరకెక్కుతోంది. మనం మనం.. బరంపురం అనేది ఉప శీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETV Win) వేదికగా ఓ సరికొత్త షో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన టైటిల్ను బుధవారం ప్రకటించారు. ‘ఉస్తాద్’ (Ustaad) అనే సరికొత్త షోతో మంచు మనోజ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ షో పూర్తి వివరాలు ఏంటి? ఎలా సాగుతుంది? తదితర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
👉 – Please join our whatsapp channel here –