Politics

మాది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు!

పిల్ల సైకోలు నన్నేమీ చేయలేరు!

రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు.

‘‘మాది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి వైకాపా నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. పిల్ల సైకోలు నన్నేమీ చేయలేరు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా ఇప్పుడు దిల్లీకి క్యూ కడుతున్నారు. చంద్రబాబు, పవన్‌ కలవకూడదని జగన్‌ విశ్వప్రయత్నాలు చేశారు. జైలులో చంద్రబాబును చూసి పవన్‌ కూడా బాధపడ్డారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతూ మెమోలు ఇస్తున్నారు. మూడు నెలలు ఓపిక పట్టాలని వారిని కోరుతున్నా’’ అని లోకేశ్ అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z