Politics

ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే!

తెలంగాణలో పోలింగ్‌ ముగియడంతో వివిధ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని వెల్లడించాయి.

ఆరా ప్రీ పోల్‌ అంచనాలు..
* భారాసకు 41 నుంచి 49, కాంగ్రెస్‌కు 48 నుంచి 67 స్థానాలు, భాజపా 5 నుంచి 7 స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచే అవకాశముందన్నారు. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు.

చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌..
* భారాస 22 నుంచి 31 స్థానాలు, కాంగ్రెస్‌ 67 నుంచి 78, భాజపా 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం 6-7 స్థానాలు కైవసం చేసుకునే అవకాశముందని చాణక్య స్ట్రాటజీస్‌ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను వెల్లడించింది.

జన్‌కీబాత్‌..
* భారాస 40 నుంచి 55 స్థానాలు, కాంగ్రెస్‌ 48 నుంచి 64 స్థానాలు, భాజపా 7 నుంచి 13 స్థానాలు, ఎంఐఎం 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశముందని జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది.

సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌ పోల్‌..
* భారాస 48, కాంగ్రెస్‌ 56, భాజపా 10, ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సీఎన్‌ఎన్‌ ఎగ్జిట్‌లో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z