Politics

పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు

పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు

వచ్చే నెల 4 నుంచి జరిగే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదం కోసం 18 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. మహిళా రిజర్వేషన్‌ చట్టంలోని నిబంధనలు జమ్ము – కశ్మీర్‌, పుదుచ్చేరికి వర్తించేలా రెండు బిల్లులతో పాటు ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు చట్టాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.

కశ్మీరీ వలసదారులు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, షెడ్యూల్‌ తెగల నుంచి నిర్వాసితులైన వారికి చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును తీసుకురానున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z