Business

చైనాను చూసి నేర్చుకోండి-వాణిజ్య వార్తలు

చైనాను చూసి నేర్చుకోండి-వాణిజ్య వార్తలు

* ఇండియన్ పోస్టాఫీసు మరో కీలక నిర్ణయం

ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. సరికొత్త పథకాలను అందిస్తూ జనాలకు మంచి లాభాలాను ఇస్తుంది.. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతుంది.. ఇక తాజాగా ఇండియన్ పోస్టాఫీసు మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సీనియర్ సిటిజెన్స్ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను సులభతరం చేయడానికి కర్నాటక ప్రభుత్వ ట్రెజరీ కమిషనర్‌తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది.. ఈ సదుపాయం రూ. 5.4 లక్షల మంది పెన్షనర్లకు సహాయం చేసే అవకాశం ఉంది.. వృద్దులకు మంచి లాభాలను అందిస్తుంది.. ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి..వ్యక్తిగతంగా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరాన్ని ఈ చొరవ దూరం చేస్తుందని భావిస్తున్నారు. బదులుగా, పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పోస్ట్‌మ్యాన్ ద్వారా ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పిపిఓ నంబర్ మరియు బయోమెట్రిక్ వివరాలతో పాటు పెన్షనర్ బ్యాంక్ ఖాతా వంటి వివరాలతో సమర్పించవచ్చు. ఒక్కో సేవకు రూ.70 చొప్పున వసూలు చేస్తారు.. దాన్ని తిరిగి మళ్లీ వారికే చెల్లిస్తారు.. ఈ పేమెంట్ సేవలు ప్రజలకు నిజంగా సహాయపడతాయని కొందరు భావిస్తున్నారు.. ఇకపోతే పోస్టాఫీస్ అందిస్తున్న కొన్ని స్కీమ్ లలో తాజాగా వడ్డీని కూడా పెంచినట్లు తెలుస్తుంది… ఈ పథకాలలో ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల ఎటువంటి రిస్క్ కూడా లేక పోవడంతో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు..

* చైనాను చూసి నేర్చుకోండి

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటారు. వారంలో 72 గంటలు పనిచేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేయడంతో కొందరు ప్రముఖులు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
తాజాగా బెంగళూరు టెక్ సమ్మిట్‌లో నారాయణమూర్తి మాట్లాడారు. ప్రస్తుతం చైనా జీడీపీ 19 ట్రిలియన్లుగా ఉందని, చైనా మోడల్‌ను అధ్యయనం చేసి అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను దేశంలో అనుసరించాలని సూచించారు. దాంతోపాటు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే అందుకు బదులుగా సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలని ఆయన కోరారు.ఆయన ఉచితాలకు వ్యతిరేకం కాదని పరిస్థితులను అర్థం చేసుకోగలనని అన్నారు. తాను పేద కుటుంబానికి చెందినవాడినని, ఉచిత రాయితీలను పొందిన వారు సమాజానికి తమ బాధ్యతగా కొంత తిరిగి ఇవ్వాలన్నారు. ఉదాహరణకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత​్‌ అందిస్తే అందుకు బదులుగా పిల్లలను బడికి పంపించి బాగా చదివేలా చూడాలన్నారు. ఏదీ ఉచితంగా ఉండకూడదని, ఏదో రూపకంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు.చైనా జీడీపీ 19 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందన్నారు. భారత్ జీడీపీ మాత్రం 3.4-4 ట్రిలియన్‌లోనే ఉందని చెప్పారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు చైనాలోనూ ఉన్నాయి. కానీ భారత్‌ కంటే 5-6 రెట్లు జీడీపీ అధికంగా ఉందన్నారు. చైనా మోడల్‌ను అధ్యయనం చేసి, ఉత్పత్తి పెంచి సమాజానికి లబ్ధి చేకూరే విషయాలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు.

* స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్ ద్వితీయ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్, నెలవారీ ఎక్స్‌పైరీ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తదుపరి నష్టాల్లో కూరుకుపోయింది. తిరిగి చివర్లో స్టాక్స్ పుంజుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 87 పాయింట్ల లబ్ధితో సరిపెట్టుకున్నది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 20,100 పాయింట్లకు ఎగువన స్థిర పడింది.నవంబర్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 30171 పాయింట్లు (4.8 శాతం) లాభ పడగా, మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 1053 (5.5 శాతం) లబ్ధితో 20,133 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24.17 లక్షల కోట్లు పుంజుకుని రూ.335.62 లక్షల కోట్లకు చేరుకున్నది.

* టాటా టెక్‌ అదుర్స్‌

టాటా గ్రూప్‌నకు చెందిన టాటా టెక్‌ సంస్థ (Tata tech) లిస్టింగ్‌ రోజున అదరగొట్టింది. ఉదయం 140 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా టెక్‌.. బీఎస్‌ఈలో 165 శాతం లాభంతో రూ.1326 వద్ద ముగిసింది. దీంతో లిస్టింగ్‌ రోజున అత్యధిక రిటర్నులు ఇచ్చిన సంస్థల జాబితాలో ఏడో స్థానంలో చేరింది.టాటా టెక్ ఐపీఓ (Tata Tech IPO) ఇష్యూ ధర రూ.500 కాగా.. బీఎస్‌ఈలో షేరు ఈ రోజు రూ.1,200 దగ్గర లిస్టయ్యింది. ఒక్కో షేరుపై లిస్టింగ్‌లోనే రూ.700 లాభం రావడం విశేషం. ఈ లెక్కన ఐపీఓలో షేర్లు అలాట్‌ అయినవారు ఒక్కో లాట్‌ (30 షేర్లు)పై రూ.15 వేలు పెట్టుబడి పెట్టగా.. లిస్టింగ్‌ ధర వద్ద రూ.21 వేల లాభాన్ని ఆర్జించినట్లయింది. తర్వాత ఈ షేరు బీఎస్‌ఈలో ఓ దశలో రూ.1,400 దగ్గర ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి 165.27 శాతం ప్రీమియంతో 1326.25 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ రూ.1200 వద్ద లిస్ట్‌ అవ్వగా.. 165.4 శాతం లాభంతో రూ.1327 వద్ద స్థిరపడింది.లిస్టింగ్‌ రోజున అత్యధిక ప్రతిఫలం ఇచ్చిన కంపెనీగా బర్న్‌పుర్‌ సిమెంట్‌ పేరిట రికార్డు ఉంది. 2008 జనవరిలో లిస్టింగ్‌కు వచ్చిన ఈ కంపెనీ షేర్లు ఏకంగా 286 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ గెయిన్స్‌ను మదుపరులకు అందించాయి. 2021లో నవంబర్‌లో లిస్టయిన సిగాచీ ఇండస్ట్రీస్‌ 270 శాతం, 2007లో లిస్టయిన అల్లీడ్‌ కంప్యూటర్స్‌ 214 శాతం, పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ 185 శాతం, రెలిగేర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ 182 శాతం, విశాల్‌ రిటైల్‌ 179 శాతం లిస్టింగ్‌ గెయిన్స్‌ అందించాయి. ఇప్పుడు టాటా టెక్నాలజీస్‌ ఐపీఓ ఆ జాబితాలో నిలిచింది.టాటా టెక్‌తో పాటు ఇవాళ లిస్టింగ్‌కు వచ్చిన గాంధార్‌ ఆయిల్‌ సైతం రాణించింది. ఇష్యూ ధర రూ.169 కాగా.. బీఎస్‌ఈలో రూ.295 వద్ద ఈ షేర్లు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఓ దశలో రూ.344 వరకు చేరిన ఈ స్టాక్‌ చివరికి 79 శాతం లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. నవంబర్‌ 24న పూర్తయిన గాంధార్‌ ఆయిల్‌ ఐపీఓకు 64.07 రెట్ల స్పందన లభించిన విషయం తెలిసిందే. 2.12 కోట్ల షేర్లు ఐపీఓలో సబ్‌స్క్రిప్షన్‌కు ఉంచగా.. 136.1 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రూ.500.69 కోట్ల సమీకరణకు లక్ష్యంతో వచ్చిన ఈ ఇష్యూకు, రూ.23,000 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి.స్టాక్‌ మార్కెట్లో గురువారం లిస్టింగ్‌కు వచ్చిన ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ లిస్టింగ్‌ రోజున ఫ్లాట్‌గా ముగిసింది. ఇష్యూ ధర రూ.140కాగా.. బీఎస్‌ఈలో రూ.137.75 వద్ద ఈ షేర్లు ప్రారంభమయ్యాయి. చివరికి ఇష్యూ ధర వద్ద ఫ్లాట్‌గా ముగిశాయి. ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఫెడ్‌ఫినా) ఐపీఓకు సబ్‌స్క్రిప్షన్‌లో 2.24 రెట్ల స్పందన వచ్చింది.

* ఎల్ఐసీ కొత్త పాలసీ

ఎల్ఐసీ పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి.. ఒక్కో పాలసీకి ఒక్కో బెనిఫిట్స్ ఉన్నాయి.. అందులో ఈ మధ్య కొత్త పాలసీలు వస్తున్నాయి.. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, జీవితాంతం బీమా కవరయ్యే పాలసీ. ఆ పాలసీని ఒకసారి తీసుకుంటే ప్రీమియం చెల్లింపు ముగిసినా కూడా బతికున్నంత కాలం ఆదాయం పొందే వీలుంటుంది. హామీ మొత్తంలో 10శాతం ఆదాయంగా మీకు చెల్లిస్తారు.. మైనర్లు కూడా అర్హులే. కనీస కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. గరిష్టంగా 65 సంవత్సరాలు పాలసీ పనిచేస్తుంది. పాలసీ చెల్లించేందుకు గరిష్ట వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల నుంచి 16ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కనీస బీమా మొత్తం రూ. 5లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కాలవ్యవధిని బట్టి వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల కాల వ్యవధికి ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే ఐదేళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది… ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు జీవించి ఉన్నంత కాలం పాలసీ ఉంటుంది..ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ కనీస బీమా మొత్తం రూ. 5లక్షల బీమా మొత్తాన్ని 30ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి, ఐదేళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఏటా 2.17లక్షలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8ఏళ్ల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే రూ. 1.43లక్షల, 16ఏళ్ల ప్రీమియం టెర్మ్ ఎంచుకుంటే రూ. 58వేలు చెల్లించాల్సి ఉంటుంది.. అంతేకాదు డెత్ బీమా మొత్తం ప్లస్ గ్యారెంటీడ్ అడిషన్స్ ఎల్ఐసీ చెల్లిస్తుంది. డెత్ బీమా మొత్తం లేదా మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఏడు రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి అందిస్తారు.. ఇక రెగ్యూలర్ ఆదాయం వద్దనుకుంటే అంతే ఎల్ఐసీ వద్దే ఉంచేసుకుంటే చక్రవడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకూ బీమా సదుపాయం కల్పిస్తారు. దీనిలో 90 రోజుల వయస్సున పిల్లల నుంచి 65ఏళ్ల వృద్ధుల వరకూ ఎవరైనా పాలసీలో చేరొచ్చు.. పన్ను మినహాయింపుతో పాటుగా లోన్ తీసుకొనే అవకాశం కూడా ఉంది..