చెన్నై వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్‌ఎల్)కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి 17వరకు రేసింగ్ లీగ్ రెండో సీజన్ జరుగనుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు..హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమన్స్ ఢిల్లీ, చెన్నై టర్బోరైడర్స్, గాడ్‌స్పీడ్ కొచ్చి, గోవా ఏసెస్, బెంగళూరు స్పీడ్‌స్టర్స్ ఉన్నాయి.
ఫార్ములా-4 కార్లతో బరిలోకి దిగుతున్న జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ లీగ్‌లో రేసర్ల వ్యక్తిగతంగా గాకుండా జట్ల ముందంజ ఆధారంగా పాయింట్లు కేటాయించనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌ను చెన్నైకి తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నామని లీగ్ ప్రమోషన్స్ చైర్మన్ అఖిలేష్‌రెడ్డి పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –