యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. ఎయిర్ పైపు పగిలిపోవడంతో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో రైలు నిపివేయడంతో ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. అనంతరం రైలును అక్కడి నుంచి పంపించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
👉 – Please join our whatsapp channel here –