Politics

పోలీసు శాఖ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేసింది!

పోలీసు శాఖ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేసింది!

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ క్రమంలో.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. అందుకు సంబంధించి పలువురు రాజకీయ పార్టీల నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడిందని ఆరోపించారు. దీక్షా దీవస్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సిగ్గువిడిచి ప్రచారం చేసిందని ఆయన తెలిపారు.

ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా కనిపిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరిగిన ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉండేదని ఆరోపించారు. పోలీసు శాఖ కేసీఆర్ కనుసన్నల్లోనే పనిచేసిందని.. డబ్బులు పంచుతుంటే పోలీసు శాఖ నిస్సహాయంగా చూస్తూ ఉండి పోయిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి డబ్బులు పంచారని.. కానీ యువత బీజేపీకి మద్దతుగా పనిచేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z