Politics

70కి పైగా స్థానాలు గెలుచుకుని హ్యాట్రిక్ సాధిస్తాం!

70కి పైగా స్థానాలు గెలుచుకుని హ్యాట్రిక్ సాధిస్తాం!

70కి పైగా స్థానాల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇది తొలిసారి కాదన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018లోనూ తెరాస ఓడిపోతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయన్నారు. 70కి పైగా స్థానాలతో భారాస అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదన్నారు. పోలింగ్‌ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z