DailyDose

తిరువూరు అష్టలక్ష్మి ఆలయంలో భట్టి విక్రమార్క-తాజా వార్తలు

తిరువూరు అష్టలక్ష్మి ఆలయంలో భట్టి విక్రమార్క-తాజా వార్తలు

తిరువూరు అష్టలక్ష్మి ఆలయంలో భట్టి విక్రమార్క

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అష్టలక్ష్మి దేవాలయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మధిర నియోజకవర్గ ఎమ్మెల్యేగా భట్టి విక్రమార్క భారీ మెజారిటీతో విజయం సాధించాలని కోరుతూ తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయంలో హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క భార్య నందిని హాజరయ్యి హోమంలో కూర్చొని భట్టి విక్రమార్క విజయాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. తిరువూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు భట్టి విక్రమార్క భార్య నందినిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క భార్య నందిని మాట్లాడుతూ.. నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని ఎందుకంటే ప్రజల మధ్య, దొరలకు మధ్య జరిగిన ఎన్నికలని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పది సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అది చూసి భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించి, ధైర్యాన్ని ఇచ్చారన్నారు. ఆ ధైర్యంతోనే ప్రజలలో పెద్ద మార్పు వచ్చిందన్నారు. మన బాధలను తీర్చడానికి మనకి ఒక నాయకుడు వున్నాడు అని ప్రజలకు భరోసా కల్పించారు భట్టి విక్రమార్క అని ఆయన భార్య నందిని తెలిపారు.పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు వచ్చిన కొన్ని సమస్యలు భట్టి విక్రమార్కకి చెప్పుకున్నారని ఆమె తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం నుంచి వచ్చిందే మా ఆరు గ్యారంటీల కార్డు అది ప్రజలలోకి పూర్తిగా వెళ్లి ప్రజలలో మార్పు వచ్చింది.. అందుకనే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని భట్టి విక్రమార్క సతీమణి నందిని పేర్కొన్నారు.

రేవంత్‌తో కాంగ్రెస్ అభ్యర్థుల కీలక భేటీ

 కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎ.చంద్రశేఖర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్‌తో పాటు మరికొంత మంది అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిని రేవంత్ రెడ్డికి వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఎగ్టిట్ పోల్స్ అంచనాల ప్రకటించిన నేపథ్యంలో టీకాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది.ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కూడా ఈ భేటీలో నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా చాలా చోట్ల రాత్రి వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఆ స్థానాల్లో పోలింగ్ సరళిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పోలింగ్ శాతం గెలుపు ఓటములపై ఎలా ఉండబోతున్నదనేది విశ్లేషించుకుంటున్నారు.

ఏపీలో తప్పిన పెను ప్రమాదం

ఏపీలోని కాకినాడ (Kakinada) తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. వివరాలు. కాకినాడ తీరం నుంచి బోటు(Boat) లో 11 మంది సభ్యులు గల మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తమ వెంట భోజన అవసరాలకు సరిపడే నిత్యావసరాలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌(Gas Cylinder)ను వెంట తీసుకెళ్లారు.వంట చేసుకుని భోజనం చేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ పేలి మంటలు వ్యాపించాయి. వారి వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌ సహాయంతో జరిగిన ఘటనను కోస్టుగార్డ్‌ సిబ్బందికి సహాయం అందజేశారు. స్పందించిన సిబ్బంది మరో బోటు సహాయంతో ఘటన స్థలానికి చేరుకుని 11 మంది మత్స్యకారులను సురక్షితంగా కాపాడి తీరానికి చేర్చారు.

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు సంచలన లేఖ

తెలంగాణ ఎన్నికల వేళ అర్ధరాత్రి ఒక్క సారిగా ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ కు చేరుకోవడం పోలింగ్ రోజునే నీటిని విడుదల చేయడం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా కృష్ణా బోర్డు (KRMB) నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ సీఎస్‌కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. అక్టోబర్ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో తెలిపింది. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి లేఖ అందలేదని తెలిపింది.

నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు

ఏపీవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఓపెన్ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి వేచి చూశారు. ఉదయం నుంచి వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వినియోగదారులు వెళ్లిపోయారు. ఇవాళ రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇదే సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

ఈ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్నది. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ మూడో శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నుంది.

* కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశమై సీఎం కేసీఆర్ తమ పార్టీ నేతలతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందన్నారు. ప్రగతి భవన్ లో ఇవాళ కలిసిన నేతలతో ఆయన మాట్లాడారు. ఫలితాలపై జరుగుతున్న ప్రచారంతో టెన్షన్ పడవద్దన్నారు. రాష్ట్రాన్ని పాలించేది బీఆర్ఎస్ అన్నారు. రెండు రోజుల తర్వాత సంబురాలు చేసుకుందామని నేతలతో తెలిపినట్లు తెలిసింది. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఈనెల 3న(ఆదివారం) ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z