జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. ముందుగా ప్రకటించిన గడువు గురువారం రాత్రితో ముగియగా.. దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు పొడిగించింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్సైట్లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. తొలి విడత ఆన్లైన్ పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
👉 – Please join our whatsapp channel here –