Sports

భారత్‌కు మరిన్ని పతకాలు సాధించడమే నా లక్ష్యం

భారత్‌కు మరిన్ని పతకాలు సాధించడమే నా లక్ష్యం

రెండు చేతులు లేకపోవడంతో జీవితంలో ఏం సాధించలేనని ఒకప్పుడు అనుకున్నానని పారా ఆర్చర్‌ శీతల్‌దేవి చెప్పింది. నంబర్‌వన్‌ అయిన నేపథ్యంలో ఆమె ఇలా స్పందించింది. ‘‘జీవితంలో ఏదీ సాధించలేనని అనుకునేదాన్ని. కానీ ప్రతి ఒక్కరూ ఎంతో సాయం చేశారు. అందుకే ఈ స్థితిలో నిలవగలిగా’’ అని శీతల్‌ చెప్పింది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిని కావాలనే ఆలోచన ఉండేదని కానీ.. అనుకోకుండా క్రీడల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ‘‘ఉపాధ్యాయురాలిని కావాలని కోరుకునేదాన్ని. కానీ క్రీడల్లోకి వచ్చా. కోచ్‌లు అభిలాష, కుల్‌దీప్‌ ఎంతో మద్దతుగా నిలిచారు. ఇప్పుడు నా లక్ష్యమంతా భారత్‌కు ఎక్కువ పతకాలు గెలవడంపైనే ఉంది’’ అని శీతల్‌ చెప్పింది. కృత్రిమ చేతుల కోసం బెంగళూరు వెళ్లిన శీతల్‌కు ప్రీతిరాయ్‌ పరిచయం కావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శీతల్‌ భుజాలు కృత్రిమ చేతులు అమర్చేందుకు అనువుగా లేవని గుర్తించిన ప్రీతి.. ఆమెను భారత హాకీ జట్టు మాజీ ఫిజియో శ్రీకాంత్‌ అయ్యంగార్‌కు పరిచయం చేసింది. చేతులు లేకపోయినా శీతల్‌ కాళ్లలో ఎంతో శక్తి ఉందని గుర్తించిన శ్రీకాంత్‌.. ఆమెను ఆర్చరీ దిశగా మళ్లించాడు. ఇదే శీతల్‌ కెరీర్‌కు మలుపు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z