Politics

టీఎస్‌లో రిపోలింగ్ అసాధ్యం

టీఎస్‌లో రిపోలింగ్ అసాధ్యం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ మూడో తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధానంపై సీఈవో వికాస్‌రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక, తాజాగా ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్‌ ఈసీ కార్యాలయంలో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారు. తెలంగాణలో 70.74 శాతం పోలింగ్‌ జరిగింది. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 2018లో పోలింగ్‌ 73.37 శాతం పోలింగ్‌ నమోదు అయ్యినట్టు తెలిపారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో మూడు శాతం పోలింగ్‌ తగ్గింది. తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ కల్పించాం. ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది’

దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది. పోలింగ్‌పై స్క్రూటినీ ఇవ్వాళ ఉదయం నుంచి జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది. లెక్కింపు జరిగినా కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎంలు లెక్కిస్తారు. ప్రతీ రౌండ్‌కు సమయం పడుతుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 ఉన్నాయి. ప్రతీ టేబుల్‌కు ఐదుగురు ఉంటారు. కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాము’ అని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z